ఆఫ్రికాకు భారత్‌ గిఫ్ట్.. కోటి డోసుల వ్యాక్సిన్ సాయం

India to supply 10 million doses of coronavirus vaccine to Africa. ఆఫ్రికాకు భారత్‌ గిఫ్ట్.. కోటి డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేసింది.

By Medi Samrat
Published on : 29 Jan 2021 9:53 AM IST

India to supply 10 million doses of coronavirus vaccine to Africa.

కరోనాతో కొట్టుమిట్టాడుతున్న‌ ఆఫ్రికాకు భారత్‌ ఆపన్న హస్తం అందించింది. భారత్‌లో తయారైన కోటి డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేసింది. ఇప్పటికే పలు దేశాలకు వ్యాక్సిన్‌ను బహుమతి ఇచ్చిన భారత్.. ఆఫ్రికాకు కూడా సాయ‌మందించింది. ఈ సంద‌ర్భంగా ‌విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మ‌హ‌మ్మారిపై పోరాటానికి అంతర్జాతీయ సహకారం అందించ‌డాన్ని భార‌త్‌ తన విధిగా భావిస్తుందన్నారు.

దేశంలో తయారైన మరో పది లక్షల డోసులను భార‌త్‌ ఐక్యరాజ్య సమితి ఆరోగ్య కార్యకర్తలకు పంప‌నుంద‌ని తెలిపారు. గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్‌ అండ్‌ ఇమ్యూనైజేషన్‌ కింద వ్యాక్సిన్‌ను పంపుతోందని వెల్ల‌డించారు. అలాగే.. ఒమన్‌కు లక్ష, కరేబియన్‌ దేశాలకు ఐదు లక్షలు, నికరాగ్వాకు రెండు లక్షలు, పసిఫిక్‌ ద్వీప దేశాలకు రెండు లక్షల‌ డోసుల వ్యాక్సిన్‌ బహుమతిగా ఇవ్వనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే.. ప్రధాని చేసిన ప్రకటన అనుగుణంగా భారత్.. మొదట పొరుగున ఉన్న తొమ్మిది దేశాలకు 55లక్షల డోసులను గిఫ్ట్‌గా ఇచ్చింది. భూటాన్‌కు 1.5లక్షలు, మాల్దీవులకు లక్ష, నేపాల్‌కు 10 లక్షలు, బంగ్లాదేశ్‌కు 20 లక్షలు, మయన్మార్ 15 లక్షలు, మారిషస్ లక్ష, సీషెల్స్ దేశాలకు 50వేలు శ్రీలంకకు ఐదు లక్షలు, బహ్రెయిన్‌కు లక్ష డోసులు ఇచ్చింది. భారత్ అందించిన వ్యాక్సిన్‌తో ఆయా దేశాల్లో ఇప్ప‌టికే వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.


Next Story