దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. విదేశాలకు కూడా వ్యాక్సిన్ సరఫరా చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది భారత్. తాజాగా భారత్ నుంచి ఐదు లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గురువారం శ్రీలంకకు చేరుకోనున్నాయి. భారత ప్రభుత్వం అనేక దేశాలకు బహుమతిగా వ్యాక్సిన్ డోసులను పంపింది. ఇప్పటి వరకు ఏడు దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపగా, ఇప్పుడు శ్రీలంకతో కలిపి ఎనిమిది దేశాలు జాబితాలో చేరాయి. వ్యాక్సిన్ మైత్రి పేరిట ఈ వ్యాక్సిన్ డోసులను పంపింది. శ్రీలంక ఆహ్వానం మేరకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జనవరి 5-7 మధ్య శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో తమ దేశానికి భారత్ వ్యాక్సిన్ డోసులను ఇవ్వాలని శ్రీలంక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వ్యాక్సిన్‌లను ఉచితంగా పంపిణీ భారత్.
మరో పక్క గత సంవత్సరం సెప్టెంబర్‌లో శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సతో భారత ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సమయంలో కరోనా మహమ్మారి కారణంగా శ్రీలంక తీవ్ర ఇబ్బందులకు గురి చేరవుతున్న నేపథ్యంలో తమకు తోచిన విధంగా ఆదుకుంటామని మోదీ మాటిచ్చారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం ఇప్పుడు ఐదు లక్షల కొవిషీల్డ్ టీకాలను శ్రీలంకకు అందిస్తోంది. అంతేకాదు గతంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత సర్కార్ 26 టన్నుల మందులను, మెడికల్ పరికరాలను కూడా అందించింది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అందించి గొప్పమనసును చాటుకుంది భారత్.