విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను పంపించాలని కోరిన ప్రధాని మోదీ

బ్రెజిల్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని స్టార్‌మర్‌ను కలుసుకున్నారు.

By Medi Samrat  Published on  19 Nov 2024 3:15 PM GMT
విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను పంపించాలని కోరిన ప్రధాని మోదీ

బ్రెజిల్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని స్టార్‌మర్‌ను కలుసుకున్నారు. భారతదేశంలోని పలు సంస్థలను మోసం చేసి పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. నీరవ్ మోదీ తమ దేశంలోనే నివసిస్తున్నాడని 2018 డిసెంబర్‌లో బ్రిటన్ ప్రకటించింది. వీరిద్దరిని తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్‌ను గతంలోనే కోరింది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది. ఆర్థిక నేరగాళ్లను అప్పగించే అంశంపై బ్రిటన్ సానుకూల ధోరణితోనే ఉన్నప్పటికీ న్యాయపరమైన అంశాల వల్ల వారిని భారత్ కు తీసుకుని రావడం కష్టంగా మారుతోంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్​లో జీ20 సదస్సుకు హాజరయ్యారు. నైజీరియా నుంచి నేరుగా బ్రెజిల్ లోని రియో డి జనీరోకు చేరుకున్న మోదీకి అక్కడి భారత సంతతి పౌరులు ఘన స్వాగతం పలికారు. జీ20 సదస్సుకు హాజరైన బైడెన్​, జిన్ పింగ్​ లను మోదీ ఆప్యాయంగా పలకరించారు. జీ20 సదస్సులో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మానుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్​తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Next Story