చైనా అలా డిసైడ్ అయితే.. భారత్ ఇలా ఫిక్స్ అయింది
India plans dam on Brahmaputra river against Chinese projects. చైనా భూభాగంలోని బ్రహ్మపుత్ర నదిపై 60 గిగావాట్ల భారీ
By Medi Samrat Published on 2 Dec 2020 5:00 PM IST
చైనా భూభాగంలోని బ్రహ్మపుత్ర నదిపై 60 గిగావాట్ల భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు చైనా ఇటీవల ప్రకటించింది. హిమాలయ నదుల్లో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందిన బ్రహ్మపుత్ర నదిపై భారీ హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. 14వ పంచవర్ష ప్రణాళిక(2021-25) అమలులో భాగంగా టిబెట్‌లో ఈ మేరకు నిర్మాణం చేపట్టనున్నట్లు చైనాఅధికార మీడియా వెల్లడించింది.
ఇంతలోనే భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది. చైనా నీటి ప్రాజెక్టుల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర జలవనరుల శాఖ సీనియర్ అధికారి టీఎస్ మెహ్రా అన్నారు. తమ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. ఇది కార్యరూపం దాల్చితే చైనా డ్యామ్‌ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు భారీగా నీటి నిల్వకు వీలుంటుందన్నారు. చైనా ప్రాజెక్టుల కారణంగా భారత్‌లో అకస్మాత్తుగా వరదలు రావడం, నీటి కొరత ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో భారత్ కూడా దూకుడుగా ప్రవర్తిస్తుంది.
యుర్లుంగ్ త్సంగ్ బో (బ్రహ్మపుత్ర నది) నదిపై చైనా ప్రాజెక్టుల కారణంగా ఇండియాలో అకస్మాత్తుగా వరదలు రావడం, నదిలో నీరు లేని వేళ, పై నుంచి విడుదల చేయక, నీటి కొరత ఏర్పడుతూ ఉండటం తదితరాల నేపథ్యంలోనే, అరుణాచల్ ఎగువ ప్రాంతాన ఈ భారీ డ్యామ్ ను నిర్మించడం ద్వారా చైనా ప్రాజెక్టుల ప్రభావాన్ని తగ్గించవచ్చు.