టారిఫ్స్‌పై అమెరికాకు భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడంపై విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా స్పందించారు. భారత్‌ను అమెరికా, యూరోపియన్ యూనియన్ టార్గెట్ చేయడం అన్యాయం, అసమంజసం అన్నారు. అన్ని దేశాల మాదిరిగానే తామూ జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తామన్నారు.
అమెరికా, యూరోపియన్ యూనిట్ కూడా రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాయని, యూరోపియన్ యూనియన్ వస్తువులు, అమెరికా యురేనియం, పల్లాడియం కొంటున్నాయని పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందని అక్కసు వెళ్లగక్కుతున్న అగ్రరాజ్యం.. యురేనియం, పల్లాడియం, కెమికల్స్ ఎందుకు దిగుమతి చేసుకుంటోందని ప్రశ్నించింది. తాము ఆయిల్ కొనడం వల్లే గ్లోబల్ ఎకానమీ స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. జాతీయ అవసరాల కంటే ఏదీ తమకు ఎక్కువ కాదని భారత్.. అమెరికాకు తేల్చి చెప్పింది.
అంతకుముందు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ విషయంలో భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో ఆయిల్ కొనుగోలు చేయడమే కాదు.. ఓపెన్ మార్కెట్‌లో అధిక లాభాలకు అమ్ముకుంటోందని ఆరోపించారు. రష్యా చేస్తున్న యుద్ధంతో ఎంతో మంది ఉక్రెయిన్ ప్రజలు చనిపోతున్నా భారత్‌కు పట్టింపు లేదన్నారు. అందుకే అమెరికాకు ఇండియా చెల్లించాల్సిన టారిఫ్స్‌ను భారీగా పెంచబోతున్నామంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.