ఆ గ్రామంలో అందరూ సైగలతోనే మాట్లాడుకుంటారు.. ఎందుకో తెలుసా?

In that village in Indonesia, everyone speaks with signs. వందలో ఒకరు అంగ వైఖల్యంతో పుడుతుండడం సహజం. కానీ ఆ గ్రామంలో మాత్రం అందరూ మూగ,

By అంజి  Published on  31 Jan 2023 5:30 PM IST
ఆ గ్రామంలో అందరూ సైగలతోనే మాట్లాడుకుంటారు.. ఎందుకో తెలుసా?

వందలో ఒకరు అంగ వైఖల్యంతో పుడుతుండడం సహజం. కానీ ఆ గ్రామంలో మాత్రం అందరూ మూగ, చెవిటి వాళ్లే. 7 దశాబ్దాలుగా అందరూ అలానే పుడుతున్నారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. అసలు ఆ గ్రామం ఎక్కడుంది.. ఎందుకు అలా పుడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండోనేషియాలో ఉన్న ఈ గ్రామం పేరు బెంగాలా. అక్కడి ప్రజలు సైగల ద్వారానే మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్లలో చాలా మందికి మాటలు రావు, చెవులు కూడా వినిపించవు. ఇలా సైగలతో మాట్లాడుకోవడాన్ని కట కోలోక్ భాష అని అంటారు. గ్రామంలోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో కూడా సైగలతోనే మాట్లాడుకుంటారు. ఆ గ్రామానికి చెవిటి ఊరు అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం అక్కడ మూడు వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ప్రపంచంలో మాట్లాడలేని, వినలేని గ్రామం ఇదే.

ఈ గ్రామంపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు.. దాని వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతంలో డీఎఫ్ఎన్‌బీ3 అనే జన్యువు ఉనికి ఉందట. 7 శతాబ్దాలుగా అక్కడ పుట్టిన వాళ్లలో ఆ జన్యువు కొనసాగుతోందట. అందుకే అక్కడి ప్రజలు చెవిటి వాళ్లుగా, మూగ వాళ్లుగా పుడుతున్నారట. అయితే అక్కడి గ్రామస్తులు మాత్రం గ్రామానికి ఏదో కీడు ఉందని అందుకే అలా పుడుతున్నారని చెబుతున్నారు. కట కోలోక్ శతాబ్దాల నాటి సంకేత భాష. ఈ భాష ఈ ఊరి ప్రజలకే అర్థం అవుతుంది. గ్రామంలోని నివాసితులలో ఎక్కువ మంది చెవిటివారు కావడంతో బయటి వ్యక్తులు గ్రామాన్ని సందర్శించడానికి వెనుకడుగు వేస్తున్నారు. దీంతో గ్రామంలోని ప్రజలు సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకోవడం తప్పనిసరి.

అయితే ఓ శాపం వల్లే తమకు ఈ చెవిటితనం వచ్చిందని గ్రామంలోని చాలా మంది అంటుంటారు. స్థానిక కథనం ప్రకారం.. ఇక్కడ నివసిస్తున్న ఇద్దరు మాంత్రికుల మధ్య గొడవ జరిగింది. ఈ పోరులో ఒకరినొకరు చెవిటివారిగా దూషించుకున్నారు. గ్రామంలోని వారందరూ ఈ ఇద్దరు చేతబడి మంత్రగాళ్ల వంశానికి చెందిన వారని గ్రామస్తులు నమ్ముతారు.

Next Story