కామెడీ చేస్తున్న ఇమ్రాన్ ఖాన్
Imran Khan says Pakistan economic conditions better than India.ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి
By M.S.R Published on 13 Jan 2022 7:54 AM GMTఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పాకిస్థాన్ ఆర్థికంగా ఎంతో దారుణంగా తయారైంది. నయా పాకిస్థాన్ ను చూపిస్తానని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ ప్రజలకు చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. బిలియన్ డాలర్ల (రూ.7,500 కోట్లు) ఆర్థిక సాయం కోసం ఐఎంఎఫ్ పెట్టిన ఎన్నో షరతులకు అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.. సంబంధిత బిల్లుకు పార్లమెంటు ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్థాన్ కు స్వయంప్రతిపత్తి నివ్వాలని ఐఎంఎఫ్ పెట్టిన షరతుల్లో ఒకటి.
ఇలాంటి సమయంలో కూడా భారత్ మీద బురద జల్లడమే పనిగా ఇమ్రాన్ ఖాన్ పెట్టుకున్నాడు. ఇస్లామాబాద్ లో ఒక కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ''పాకిస్థాన్ ఎన్నో దేశాల కంటే ముఖ్యంగా భారత్ తో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉంది. ఎన్నో దేశాలతో పోల్చి చూసినా కానీ చౌక దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ప్రతిపక్షం అసమర్థ ప్రభుత్వం అంటూ విమర్శిస్తోంది. కానీ మా ప్రభుత్వం అన్ని సంక్షోభాల నుంచి దేశాన్ని కాపాడిందని" అన్నాడు. అంతా ఓకె కానీ ఏ మాత్రం భారత్ తో పోలిక లేని పాక్ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉందని గొప్పలు చెప్పుకోవడం పాక్ ప్రజలే ఒప్పుకోవడం లేదు. ఇమ్రాన్ ఖాన్ కామెడీ చేస్తున్నాడని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.