పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో ఇమ్రాన్ జరిపిన శృంగార సంభాషణకు చెందిన ఆడియో క్లిప్ లీకైంది. పాక్ జర్నలిస్టు సయ్యిద్ అలీ హైదర్ ఆ ఆడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. ఇమ్రాన్ తన పదవి కోల్పోయిన తర్వాత ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఆ ఆడియో క్లిప్‌లు నకిలీవని, ఫేక్ వీడియోలను ప్రభుత్వం సృష్టిస్తోందని ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఆరోపించింది.
ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఆడియో క్లిప్‌లను నకిలీ అని పేర్కొంది. ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకోవడానికి నకిలీ వీడియోలు, ఆడియోలను ఉపయోగిస్తోందని ఆరోపించింది. PTI ఛైర్మన్ రాజకీయ ప్రత్యర్థులు నకిలీ ఆడియోలు, వీడియోలను సృష్టించడం పైనే దృష్టి పెట్టారు అని PTI నాయకుడు అర్స్లాన్ ఖలీద్ పేర్కొన్నారు. క్లిప్‌లలోని వాయిస్ ఇమ్రాన్ ఖాన్‌కు చెందినదని ఇంకా నిర్ధారించలేదు, అయితే పాకిస్తాన్ మాజీ ప్రధానిపై ఆన్‌లైన్‌లో పలువురు విరుచుకుపడుతున్నారు. "ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ హష్మీగా మారాడు" అని జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ట్వీట్ చేశారు.