అంతా ఆయనే చేశాడు..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాల గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 11:18 AM ISTపాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాల గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కూడా టార్గెట్ చేశారు. భారత్‌తో సంబంధాలను చెడగొట్టడంలో ఇమ్రాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారని నవాజ్ అన్నారు. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుత పాకిస్థాన్ పర్యటన పట్ల నవాజ్ షరీఫ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇరుపక్షాలు మాట్లాడుకోవాలని మూడుసార్లు పాక్ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ గురువారం అన్నారు. 2015లో ప్రధాని మోదీ అకస్మాత్తుగా లాహోర్ రాకను కూడా ఆయన అభినందించారు. పాత విషయాలను మరచిపోయి కొత్త ప్రారంభం కావాల్సిన సమయం ఆసన్నమైందని నవాజ్ అన్నారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్ 15న పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సుష్మా స్వరాజ్ చివరిసారి పాకిస్థాన్‌లో పర్యటించారు.
ఇరు దేశాల మధ్య క్రికెట్, వాణిజ్యం పునరుద్ధరణ జరగాలని నవాజ్ షరీఫ్ అన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు వారధి పాత్రను పోషించేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. మంచి పొరుగువారిలా జీవించాలని నవాజ్ షరీఫ్ అన్నారు. దాదాపు 70 ఏళ్లు పోరాటం చేశాం. దీన్ని 70 ఏళ్లు ముందుకు తీసుకెళ్లకూడదు. ఇరు దేశాలు కూర్చుని చర్చించుకుని సానుకూలంగా ముందుకు సాగాలి. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య వాణిజ్యం నిలిచిపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదు.
మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై నవాజ్ షరీఫ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌తో సంబంధాలు చెడిపోవడానికి ఇమ్రాన్ ఖాన్ కారణమని ఆయన అన్నారు. ప్రధాని మోదీపై ఇమ్రాన్ ఖాన్ పలు వ్యాఖ్యలు చేయడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇతర దేశాల నేతల గురించి ఇలాంటి మాటలు వాడడం మానేద్దామని నవాజ్ షరీఫ్ అన్నారు.