2022లో ట్రంప్ అధ్యక్షుడైతే ఉక్రెయిన్ యుద్ధం ఉండేది కాదు: పుతిన్

2022లో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం ఎప్పటికీ జరిగి ఉండేది కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం అన్నారు.

By అంజి
Published on : 16 Aug 2025 6:30 AM IST

Trump, war, Putin, Alaska talks,Ukraine

2022లో ట్రంప్ అధ్యక్షుడైతే ఉక్రెయిన్ యుద్ధం ఉండేది కాదు: పుతిన్

2022లో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం ఎప్పటికీ జరిగి ఉండేది కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం అన్నారు. ఐదు సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడితో తన మొదటి ముఖాముఖి సమావేశం సంబంధాలలో పునరుద్ధరణకు ఆశాజనకంగా ఉందని ఆయన అన్నారు.

ఉక్రెయిన్‌లోని పరిస్థితి అక్కడి వారి భద్రతకు ముప్పు కలిగిస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. 'సంఘర్షణకు గల కారణాలకు ముగింపు దొరకాలని ఆశిస్తున్నా. మా చట్టబద్ధమూన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉక్రెయిన్‌ భద్రతకు హామీ ఉండాలనే అంశాన్ని స్వాగతిస్తున్నా. మా ఈ ఒప్పందం ఆ దేశంలో శాంతివైపు మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నా' అని తెలిపారు. తదుపరి సమావేశం మాస్కోలో జరుగుతుందని పుతిన్‌ పేర్కొన్నారు. యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధానంగా ఉక్రెయిన్‌ అంశంపై చర్చించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. ఈ భేటీలో చాలా అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చామన్నారు.

అమెరికాతో నాలుగేళ్లపాటు ఎలాంటి సంబంధాలు లేకపోవడం అనేది నిజంగానే చింతించాల్సిన విషయమ్నారు. తాను జెలెన్‌స్కీ, నాటోకి ఫోన్‌ చేసి మాట్లాడతానని, నిర్ణయం వారి చేతుల్లోనే ఉందని అన్నారు. ఈవిషయంలో కచ్చితంగా ట్రంప్‌కు ధన్యవాదాలు చెప్పాలని వ్యాఖ్యానించారు. అటు పుతిన్‌తో చర్చల తర్వాత ట్రంప్‌ జెలెన్‌స్కీకి ఫోన్‌ చేసి మాట్లాడినట్టు సమాచారం. ఈ భేటీ వివరాలను ఆయన వారికి తెలియజేసినట్టు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకేవేళ రష్యా ఏమైనా షరతులు పెట్టి ఉంటే.. వాటిని జెలెన్‌స్కీకి వివరించినట్టు తెలుస్తోంది.

Next Story