మైనర్ బాలుడి కారణంగా తల్లైన మహిళా మంత్రి

ఓ మహిళా మంత్రి తన పదవికి రాజీనామా చేసింది. అది కూడా మూడు దశాబ్దాల కిందట చేసిన తప్పుకు.

By Medi Samrat
Published on : 22 March 2025 5:22 PM IST

మైనర్ బాలుడి కారణంగా తల్లైన మహిళా మంత్రి

ఓ మహిళా మంత్రి తన పదవికి రాజీనామా చేసింది. అది కూడా మూడు దశాబ్దాల కిందట చేసిన తప్పుకు. ఐస్లాండ్ పిల్లల మంత్రి అస్థిల్దుర్ లోవా థోర్స్‌డోట్టిర్ మూడు దశాబ్దాల క్రితం టీనేజర్ తో బిడ్డను కన్నది. ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించిన ఆమె.. తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం 58 ఏళ్ల అస్థిల్దుర్ లోవా థోర్స్‌డోట్టిర్ 36 ఏళ్ల కిందట తాను తప్పు చేశానని తెలిపారు. ఆ బాలుడు మతపరమైన కార్యక్రమాల్లో హాజరవుతూ ఉండగా లోవా కౌన్సెలర్‌గా ఉండేది. ఆ సమయంలో ఆమెకు 22 ఏళ్లు, అతనికి 15 ఏళ్లు అని బిబిసి నివేదించింది. ఆమె మంత్రి పదవి నుంచి వైదొలిగినప్పటికీ, పార్లమెంటుకు రాజీనామా చేసే ఆలోచనలో లేదు.

ఆమె 23 సంవత్సరాల వయసులో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ తండ్రికి 16 సంవత్సరాలు.ఐస్లాండ్‌లో కాన్సెన్ట్ (అందుకు అనుమతి) వయస్సు 15 సంవత్సరాలు. కొన్ని సందర్భాలలో ఆ వయసు 18గా కూడా ఉంది. అయితే దోషులుగా తేలిన వారికి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇది జరిగి 36 సంవత్సరాలు అయిందని, చాలా విషయాలు లోవా చెప్పింది. అయితే ఈ రోజు ఖచ్చితంగా ఆ సమస్యలను భిన్నంగా పరిష్కరించేవారమని తెలిపింది.

Next Story