హైదరాబాద్ కు చెందిన మహిళకి రెండు కోట్ల రూపాయల లాటరీ

Hyderabadi woman wins over Rs 2 crore in UAE’s Mahzooz draw. హైదరాబాద్ కు చెందిన మహిళ రెండు కోట్ల రూపాయల లాటరీ గెలుచుకుంది.

By Medi Samrat
Published on : 17 April 2023 5:25 PM IST

హైదరాబాద్ కు చెందిన మహిళకి రెండు కోట్ల రూపాయల లాటరీ

హైదరాబాద్ కు చెందిన మహిళ రెండు కోట్ల రూపాయల లాటరీ గెలుచుకుంది. రెండు కోట్ల 20 లక్షల రూపాయలను ఆమె గెలుచుకుంది. దుబాయ్ లో హైదరాబాద్ కు చెందిన మహిళ ఇలాంటి లాటరీ గెలవటం ఇదే మొదటిసారి. లాటరీని సొంతం చేసుకున్న మహిళ పేరు హమీద బేగం. ఈమె అబుదాబిలో నివసిస్తుంది. మూడేళ్ళుగా మెడికల్ కోడర్ గా పని చేస్తుంది. ఓ సంస్థ నిర్వహించే లాటరీలో 100 రూపాయలతో టికెట్ కొనుగోలు చేసింది. ఈ లాటరీ లక్కీ డ్రాలో ఆమె కొనుగోలు చేసిన టికెట్ కు ఫ్రైజ్ మనీ వచ్చింది. గెలుచుకున్న డబ్బును తన నలుగురి పిల్లల చదువు, వారి పోషణ కోసం ఖర్చు చేస్తానని చెబుతోంది. లక్కీ డ్రాలో 10 లక్షల దిర్హామ్ లు గెలుచుకున్న తొలి మహిళగా రికార్డ్ క్రియేట్ చేసింది.


Next Story