ఏలియన్స్ ఉన్నాయంటున్న ఇజ్రాయేల్‌ మాజీ జనరల్‌

Humans have already made contact with aliens. ఏలియన్స్.. అదే గ్రహాంతరవాసులు.. ఈ సువిశాల విశ్వంలో మనం ఒక్కరమే కాదు

By Medi Samrat
Published on : 8 Dec 2020 4:55 PM IST

ఏలియన్స్ ఉన్నాయంటున్న ఇజ్రాయేల్‌ మాజీ జనరల్‌

ఏలియన్స్.. అదే గ్రహాంతరవాసులు.. ఈ సువిశాల విశ్వంలో మనం ఒక్కరమే కాదు అని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు భూమి మీదకు వచ్చి వెళ్తున్నారని కూడా చాలా మందే మాట్లాడుతూ వచ్చారు. తాజాగా ఇజ్రాయేల్‌ మాజీ జనరల్‌ గ్రహాంతరవాసుల‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రహంతార వాసులు నిజంగానే ఉన్నారని.. భూమ్మీద మనతో పాటు కలిసి తిరుగుతున్నారన్నారు. మాజీ ఇజ్రాయెల్ జనరల్, ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 'హైమ్ ఎషెడ్' చెప్పుకొచ్చారు.

ఏలియన్స్ రహస్యంగా మన ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నారని.. వారి సమయాన్ని మనతో వెచ్చిస్తున్నారని అన్నారు. అమెరికా, ఇజ్రాయేల్‌ ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా ఏలియన్స్‌తో కలిసి పని చేస్తున్నాయని.. భూమ్మీద వారిని అంగీకరించే పరిస్థితులు లేనందున ఈ విషయాలని రహస్యంగా ఉంచారని అంటున్నాడు. ఈయన ఇజ్రాయేల్‌ స్పేప్‌ సెక్యూరిటీ ప్రొగ్రామ్‌లో 1981-2010 వరకు పని చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ ఏలియన్స్‌ గురించి బయట ప్రపంచానికి తెలియజేయాలని అనుకున్నా.. గెలాక్సీ ఫెడరేషన్‌‌లోని ఏలియన్స్‌ ఆయనను ఆపాయన్నారు. ఏలియన్స్ మనిషుల మీద హింసకు దిగాలని అయితే అనుకోవడం లేదట. మనకు తగినంత సమయం ఇచ్చి అవగాహన ఏర్పర్చుకోవాలని కోరుకుంటున్నాయట..! గ్రహాంతరవాసుల ఉనికిని తాను నిరూపించగలనని, ఎందుకంటే వారు చాలా కాలం నుంచి మన మధ్య ఉన్నారని అన్నారు.

గ్రహాంతర వాసులు సొంతంగా గెలాక్సీ ఫెడరేషన్ అనే సంస్థను కలిగి ఉన్నారని తెలిపారు. మనుషులకు అంతరిక్షం, స్పేస్‌షిప్స్‌, ఏలియన్స్‌ పట్ల ఓ అవగాహన వచ్చే వరకు తమ ఉనికిని బహిర్గతం చేయాలని వారు భావించడం లేదట. అమెరికా ప్రభుత్వం ఎప్పటి నుండో ఏలియన్స్ తో సత్సంబాలను కలిగి ఉందని ఆయన బల్లగుద్ది చెబుతూ ఉన్నారు. ఇప్పటికే యూఎఫ్ఓ లకు సంబంధించిన ప్రచారం విపరీతంగా జరుగుతున్న సమయంలో ఇలాంటి సంచలన విషయాన్ని ఆయన వెల్లడించడంతో ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది.


Next Story