పాకిస్థాన్‌లో అత్యంత సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్

Huge blast in Pakistan's Quetta leaves many injured. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో భారీ బాంబు పేలుడు సంభవించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Feb 2023 2:00 PM GMT
పాకిస్థాన్‌లో అత్యంత సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పలువురు వ్యక్తులు గాయపడ్డారు. పాకిస్థాన్‌ వార్తా వెబ్ సైట్ Dawn.com ప్రకారం, ఆదివారం ఉదయం FC ముస్సా చెక్‌పాయింట్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది, ఐదుగురికి పైగా గాయపడ్డారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, క్వెట్టా పోలీసు ప్రధాన కార్యాలయం, క్వెట్టా కంటోన్మెంట్ ప్రవేశ ద్వారం సమీపంలోని ఎంతో సెక్యూర్డ్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే మృతుల సంఖ్య తెలియరాలేదు.గాయపడిన వారిని క్వెట్టాలోని సివిల్ హాస్పిటల్‌కు తరలించినట్లు ఆ ప్రాంతంలో సహాయకార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈధి వర్కర్ జీషన్ అహ్మద్ మీడియాకి తెలిపారు. పోలీసులు, ఎమర్జెన్సీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు చెప్పారు.

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలోని పెషావర్‌లోని హై-సెక్యూరిటీ జోన్‌లో సోమవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో భక్తులతో నిండిన మసీదులో తాలిబాన్ ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 80 మందికి పైగా మరణించారు.. 150 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో చాలా మంది పోలీసులే ఉన్నారు.

Next Story