పాక్‌లో హిందూ యువతి కిడ్నాప్‌.. బలవంతంగా మతం మార్చి.. ఆపై

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఒక హిందూ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని, ఆమెకు వివాహం కూడా

By అంజి  Published on  9 Jun 2023 7:30 AM IST
Hindu teen, Pakistan, kidnap, Islam, international news

పాక్‌లో హిందూ యువతి కిడ్నాప్‌.. బలవంతంగా మతం మార్చి.. ఆపై

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఒక హిందూ బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని, ఆమెకు వివాహం కూడా చేశారని ఆమె తండ్రి చెప్పారు. సుహానా అనే టీనేజ్‌ బాలికని కిడ్నాప్ చేసి సింధ్‌లోని షహీద్ బెనజీరాబాద్ జిల్లాలోని ఖాజీ అహ్మద్ తాలూకాకు ఆమె ట్యూటర్ అక్తర్ పంపారు. ఈ సంఘటన గురించి 14 ఏళ్ల బాలిక తండ్రి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ముగ్గురు సాయుధ వ్యక్తులు అక్తర్ గాబోల్, ఫైజన్ జాట్, సారంగ్ ఖస్ఖేలీ తమ ఇంట్లోకి ప్రవేశించి, బంగారు ఆభరణాలను దోచుకుని, తుపాకీతో సుహానాను కిడ్నాప్ చేశారని చెప్పారు.

దిలీప్‌ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తన కుమార్తెను తిరిగి పొందాలనే ఆశ అతనికి లేదు, ఎందుకంటే సుహానా తన ఇష్టానుసారం మతం మారిందని మరియు వివాహం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో హిందూ బాలికలు, వివాహిత మహిళలను బలవంతంగా మతమార్పిడి చేసే కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్‌లోని హిందువులు ప్రధానంగా సింధ్ ప్రావిన్స్‌లో కేంద్రీకృతమై ఉన్నారు. ఇక్కడ దేశంలోని హిందూ ఎన్‌క్లేవ్‌లు ఎక్కువ. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ప్రకారం, దేశంలోని 207 మిలియన్ల జనాభాలో ముస్లింలు దాదాపు 96 శాతం ఉండగా, హిందువులు 2.1 శాతం మరియు క్రైస్తవులు 1.6 శాతం ఉన్నారు.

Next Story