ఆ గడ్డ మీద ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ ఆమె..!
ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్ధులు ప్రచారంలో బిజీగా ఉన్నారు.
By Medi Samrat Published on 5 Feb 2024 8:35 AM GMTఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్ధులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో హిందూ మహిళ సావిరా ప్రకాష్ పోటీ చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ ఆమే కావడం విశేషం. హిందువు అయినప్పటికీ.. ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడ ఆమెకు విపరీతమైన మద్దతు లభిస్తోంది.
సమాచారం ప్రకారం సవీరా ప్రకాష్ పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని బునెర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆమెకు తన పార్టీ నుంచి టికెట్ ఇచ్చింది. సవీర వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె తండ్రి పేరు ఓం ప్రకాష్. ఓం ప్రకాష్ PPPలో చాలా కాలం సభ్యుడు. ఆయన కూడా వైద్యుడు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాకు ఇచ్చిన ప్రకటనలో సవీరా ప్రకాష్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య సత్సంబంధాలకు వారధిగా పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నేనే స్వయంగా డాక్టర్‌ని, అందుకే పాకిస్థాన్‌లోని ఆసుపత్రుల్లో, ఇతర ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అధ్వాన్నంగా ఉండడం చూసి.. దాని కోసం పనిచేసి మెరుగుపరుచుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
సమాచారం ప్రకారం సవీర్ ప్రకాష్ 2022 సంవత్సరంలో అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుండి పట్టభద్రురాలు అయ్యింది. ఆమె బునర్ అసెంబ్లీ PPP పార్టీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చాలా కాలంగా తండ్రితోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. పాకిస్థాన్‌లో మహిళల అభివృద్ధికి, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ఆమె కృషి చేయాలన్నారు.