ఇరాన్‌పై అమెరికా దాడులకు అదే కారణమా?
ఓ వైపు చర్చలు కొనసాగుతుండగా సడన్‌గా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిపి అమెరికా దాడులు చేయడం చర్చనీయాంశమైంది.
By - అంజి |
ఇరాన్‌పై అమెరికా దాడులకు అదే కారణమా?
ఓ వైపు చర్చలు కొనసాగుతుండగా సడన్‌గా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిపి అమెరికా దాడులు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఇరాన్ వైఖరి పట్ల అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి చెందడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇరాన్ మొదట నుంచి న్యూక్లియర్ అగ్రిమెంట్ చర్చలపై నిజాయితీగా లేదని యూఎస్ అధికారులు చెబుతున్నారు. పౌరుల అవసరాల కోసం ఉచితంగా న్యూక్లియర్ ఫ్యూయెల్ అందిస్తామన్నా ఇరాన్ యురేనియంపై పట్టుబట్టిందని తెలిపారు.
ఇరాన్‌పై దాడులకు సంబంధించి యూఎస్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. యుద్ధ నౌకల ద్వారా మిస్సైళ్లు, ఫైటర్ జెట్లను ప్రయోగించి ఇరాన్ స్థావరాలపై దాడులు చేసిన దృశ్యాలను యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో షేర్ చేసింది. ఇరాన్ డ్రోన్లు ఉన్న స్థావరాలు, కీలక మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఈ దాడులు చేపట్టినట్టు పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ ముప్పు నుంచి అమెరికన్లను కాపాడుకోవడమే తమ లక్ష్యమని తెలిపింది.
ఇజ్రాయెల్ - అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుటుంబంలోని నలుగురు చనిపోయినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆయన కూతురు, అల్లుడు, కోడలు, మనవడు చనిపోయినట్టు పేర్కొంది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఖమేనీ ఇంటిపై 30 బాంబులు వదిలినట్టు తెలిపింది. ఇందుకోసం ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోందని, అగ్రనాయకులు అందరూ ఒకే దగ్గర ఉండటంతో అటాక్ చేసిందని వెల్లడించింది.