ఈ జంతువులు ఆహారం లేకున్నా బతికేస్తాయి

సాధారణంగా ఈ భూమిపై ఉన్న ఏ జీవి అయినా రోజుల పాటు ఆహారం తీసుకోకపోతే నీరసించి చనిపోతాయి. అయితే కొన్ని జీవులు అలా కాదు.

By అంజి  Published on  26 May 2023 11:44 AM IST
animals, food,  snake, Interesting news, international news

ఈ జంతువులు ఆహారం లేకున్నా బతికేస్తాయి

సాధారణంగా ఈ భూమిపై ఉన్న ఏ జీవి అయినా రోజుల పాటు ఆహారం తీసుకోకపోతే నీరసించి చనిపోతాయి. అయితే కొన్ని జీవులు అలా కాదు. అవి కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఆహారం లేకుండా ఉండగలుగుతాయి. ఆ కోవకు చెందిన జంతువులేంటో.. ఇప్పుడు చూద్దాం..

ఒంటె: ఒంటె తనపై భాగంలోని మాపురంలో, కొవ్వులను నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఎడారిలో సుమారు 20 రోజుల పాటు ప్రయాణిస్తూ కూడా నీరు, ఆహారం లేకుండా జీవిస్తుంది.

సొర చేప: సొర చేపలు 6 నుంచి 8 వారాల పాటు ఆహారం లేకుండా జీవించగలవు. ఆహారం లేని సమయంలో దీని వేట నైపుణ్యాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

పాము: చలికాలంలో పాముల జీవక్రియ 70 శాతానికి తగ్గుతుంది. దాంతో ఆహారం తీసుకోవు. సుమారు రెండు నెలల వరకు అలాగే ఉండగలుగుతాయి.

సాలీడు: సాలీడు శరీర నిర్మాణం కారణంగా 3 నుంచి 4 నెలల వరకు ఆహారం లేకుండా జీవించగలవు. కొన్ని సార్లు సంవత్సరం పాటు కూడా ఉంటాయి.

పెంగ్విన్: చల్లని వాతావరణం కారణంగా పెంగ్విన్‌ జీవక్రియ మందగిస్తుంది. 2 నుంచి 4 నెలల వరకు ఆహారం, నీరు లేకుండా జీవించడానికి వాటికి ఈ చర్య సహాయపడుతుంది.

కప్ప: మూడు నుంచి నాలుగు వారాలు ఆహారం లేకుండా జీవించగలదు.

మొసలి: మొసలి నెమ్మదిగా కదలడం, ఒకే చోట స్థిరంగా ఉండటం ద్వారా శక్తిని ఆదా చేసుకుంటుంది. దాంతో తిండి కరువైనా ఏడాది వరకు జీవిస్తుంది.

తాబేలు: తాబేలు ఎలాంటి ఆహారం లేకున్నా 3 నుంచి 6 నెలలు ఉంటుంది.

ఎలుగుబంటి: చలికాలంలో ఎలుగుబంటి ఎక్కువగా నిద్రపోతుంది. దాని జీవక్రియ తగ్గుతుంది. అప్పటికే శరీరంలో నిల్వ ఉన్న శక్తి కారణంగా ఆహారం, నీరు లేకుండా 100 రోజుల వరకు జీవించగలదు.

Next Story