నేపాల్‌లో కూలిన విమానం.. ఐదుగురు మృతి

నలుగురు ప్రయాణికులు ఒక పైలట్ తో సహా.. మొత్తం ఐదుగురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారం నేపాల్ రాజధాని ఖాట్మండుకు దగ్గరలోని అడవిలో కూలిపోయింది

By Medi Samrat  Published on  7 Aug 2024 5:30 PM IST
నేపాల్‌లో కూలిన విమానం.. ఐదుగురు మృతి

నలుగురు ప్రయాణికులు ఒక పైలట్ తో సహా.. మొత్తం ఐదుగురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారం నేపాల్ రాజధాని ఖాట్మండుకు దగ్గరలోని అడవిలో కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు ప్రమాదంలో మరణించారు. నేపాల్ లో సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కూలి 18 మంది మరణించిన ఘటన మరువక ముందే ఈ సంఘటన జరిగింది.

నువాకోట్‌లోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా కూడా తెలిపింది. నివేదికల ప్రకారం, హెలికాప్టర్ ఖాట్మండు నుండి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద కొండను ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, అధికారులు రెస్క్యూ టీమ్‌ను సంఘటనా స్థలానికి పంపించారు. హెలికాప్టర్ మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుండి బయలుదేరినట్లు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. టేకాఫ్‌ అయిన మూడు నిమిషాలకే చాపర్‌ తో సంబంధాలు తెగిపోయాయి.

Next Story