నేపాల్‌లో భారీ వర్షాలు.. పెరుగుతున్న మృతుల సంఖ్య.!

Heavy rains in nepal. భారీ వర్షాలతో నేపాల్‌ దేశం అతలాకుతలం అవుతోంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి

By అంజి  Published on  21 Oct 2021 3:04 PM GMT
నేపాల్‌లో భారీ వర్షాలు.. పెరుగుతున్న మృతుల సంఖ్య.!

భారీ వర్షాలతో నేపాల్‌ దేశం అతలాకుతలం అవుతోంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి వరదలు పొటెత్తుతున్నాయి. దీంతో వాగులు, వంకల పొంగిపొర్లుతూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటి వరకు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరింది. 11 మంది పలు ప్రాంతాల్లో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 30 మంది గల్లంతయ్యినట్లు మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఇక తూర్పు నేపాల్‌లోని పంచతార్‌లో వర్షాల కారణంగా 27 మంది మృతి చెందారు.

దోతి, ఇలం జిల్లాల్లో మరో 13 మంది చనిపోయారు. బైతాడి, హుమ్లా, సోలుఖుంబు, కలికోట్‌, దడెల్ధురా, ప్యూథాన్‌, బజాంగ్, సున్సారీ, ఉదయ్‌పూర్‌, మొరాంగ్‌లో భారీ వర్షాలతో జనం మృత్యువాత పడ్డారు. మరోవైపు హుమ్లా జిల్లాలో విదేశీ పర్యాటకులు చిక్కుకున్నారు. కాగా వారిని రక్షించాలని నేపాల్‌ పోలీస్‌, సాయుధ పోలీస్‌ ఫోర్స్‌, నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌, ఆర్మీని హోంమంత్రి బాలకృష్ణ ఖండ్‌ ఆదేశించారు.


Next Story