నిజ్జార్‌ను చంపిన నిందితులు వీరేనంటున్న కెనడా

గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చిన హిట్ స్క్వాడ్‌లో భాగమని అనుమానిస్తున్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేసినట్లు కెనడా పోలీసులు శుక్రవారం తెలిపారు

By Medi Samrat  Published on  4 May 2024 7:45 AM GMT
నిజ్జార్‌ను చంపిన నిందితులు వీరేనంటున్న కెనడా

గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చిన హిట్ స్క్వాడ్‌లో భాగమని అనుమానిస్తున్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేసినట్లు కెనడా పోలీసులు శుక్రవారం తెలిపారు. నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల పాత్ర ఉందని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో భారతదేశం- కెనడా మధ్య దౌత్యపరమైన వివాదానికి కేంద్రంగా మారింది. భారతదేశం ఈ అభియోగాలను తప్పుబట్టింది. అరెస్టయిన ముగ్గురు భారతీయులు కరణ్ బ్రార్, 22, కమల్‌ప్రీత్ సింగ్, 22, కరణ్‌ప్రీత్ సింగ్, 28 అని తెలుస్తోంది. వారి ఫొటోలను కూడా పోలీసులు విడుదల చేశారు. వారిపై ఫస్ట్-డిగ్రీ హత్య, హత్యకు కుట్ర పన్నారని చూపించారు. అనుమానితులకు భారత ప్రభుత్వంతో గల సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ టెబౌల్ మాట్లాడుతూ.. ఈ విషయాలపై ప్రత్యేక, విభిన్నమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఈరోజు అరెస్టయిన వ్యక్తుల ప్రమేయానికి మాత్రమే పరిమితం కాదు, ఈ ప్రయత్నాలలో భారత ప్రభుత్వంతో సంబంధాలను పరిశోదిస్తున్నామని తెలిపారు. ఉగ్రవాది, కెనడియన్ పౌరుడు నిజ్జర్ ను జూన్ 18, 2023న సర్రేలోని గురుద్వారా వెలుపల కాల్చి చంపారు. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది.

Next Story