ట్రంప్ కు అలా కౌంటర్ వేసిన పర్యావరణం పిల్ల..!

Greta Thunberg wishes 'old man' Trump a 'wonderful future'. గ్రెటా థన్ బర్గ్‌.. పర్యావరణ కార్యకర్త, డొనాల్డ్‌ ట్రంప్‌ కు సామాజిక మాధ్యమాల్లో కౌంటర్లు వేసిన గ్రెటా.

By Medi Samrat
Published on : 21 Jan 2021 7:03 PM IST

Greta Thunberg wishes ‘old man’ Trump a ‘wonderful future

గ్రెటా థన్ బర్గ్‌.. పర్యావరణ కార్యకర్త అంటూ స్వీడిష్ యువతికి పేరు ఉంది. పర్యావరణానికి హాని కలిగించే విధంగా దేశాధినేతలు ప్రవర్తిస్తూ ఉన్నారని.. రాబోయే తరాలు భూమి మీద మనుగడ సాగించడం కష్టమే అని ఆమె ఉద్యమానికి తెరలేపారు. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు సామాజిక మాధ్యమాల్లో కౌంటర్లు వేసిన గ్రెటా మరోసారి ట్రంప్ కోసం సెండాఫ్ పోస్టు పెట్టింది.


ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుండి దిగిపోతూ ఉన్న సమయంలో ట్రంప్ ఫోటోను పెట్టి 'ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న సంతోషవంతమైన వృద్దుడిలా ట్రంప్‌ కనిపిస్తున్నారు. ఇలా చూడటం చాలా బాగుంది.' అంటూ గ్రెటా థన్ బర్గ్ ట్వీట్‌ చేశారు. ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడుతున్న ఫోటోను కూడా షేర్ చేసింది.

ఐక్యరాజ్య సమితి వేదికపై గ్రెటా ప్రపంచ పర్యావరణ అంశాన్ని ప్రపంచాధినేతలు నిర్లక్క్ష్యం చేస్తున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండదంటూ నిర్భయంగా మాట్లాడింది. దీనిపై స్పందించిన అప్పటి యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ 'ఆమె ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చాలా సంతోషవంతమైన యువతిలా ఉంది. చూడటానికి చాలా బాగుంది.' అంటూ ట్వీట్‌ చేశారు. 'టైమ్‌' మేగజీన్ 2019 సంవత్సరానికి గాను 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' గా గ్రెటా పేరును ప్రకటించినప్పుడు చిల్ గ్రెటా చిల్!' అంటూ ట్రంప్‌ ఎద్దేవా చేశారు. వాటికి కౌంటర్లను ట్రంప్ మీద గ్రెటా ఎప్పటికప్పుడు వేసేసి సైలెంట్ అయిపోయింది. తీసుకున్నది వెనక్కు ఇచ్చేయడమంటే ఇదేనేమో..!


Next Story