ప్రముఖ మ్యాగజైన్ ప్లేబాయ్ కవర్‌పై కనిపించారు ఫ్రెంచ్ మంత్రి మార్లిన్ షియప్ప. గ్లామర్ డోస్ తో రెచ్చిపోయారు. అయితే ఆమె చేసిన ఈ పని కారణంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆమె వస్త్రధారణ తప్పుడు సంకేతాలను ఇస్తుందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. మార్లీనెతో ప్రధాని ఎలిజబెత్ బోర్న్ మాట్లాడారు.
అయితే మార్లిన్ షియప్ప తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. "Defending the right of women to have control of their bodies is everywhere and all the time. In France, women are free," అంటూ షియప్ప ట్వీట్ చేశారు. మహిళలకు తమ శరీరభాగాలపై నియంత్రణ ఉంటుందని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ లో మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని ఆమె అన్నారు. సోషల్ ఎకానమీ, ఫ్రెంచ్ అసోసియేషన్ల మంత్రి అయిన షియప్ప గతంలో మహిళల హక్కుల కోసం తన వాయిస్ ను వినిపించి ప్రశంసలు దక్కించుకున్నారు. మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల ప్లేబాయ్ పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫొటో షూట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు.