బ్రేకింగ్‌.. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత‌

Former Pakistan President Pervez Musharraf passes away.పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ క‌న్న‌మూశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2023 6:34 AM GMT
బ్రేకింగ్‌.. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత‌

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ క‌న్న‌మూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న దుబాయ్‌లోని అమెరికన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ తెలిపింది. ఆయ‌న వ‌య‌స్సు 79 సంవ‌త్స‌రాలు.

దేశ విభ‌జ‌న‌కు ముందు ఆగ‌స్టు11న 1943 ఢిల్లీలో జ‌న్మించాడు ముషార‌ఫ్. విభ‌జ‌న అనంత‌రం కుటుంబంతో క‌లిసి పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. సైన్యంలో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి పాకిస్తాన్ అధ్య‌క్షుడిగా ఎదిగాడు.

1999లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పదవీచ్యుతుడిని చేస్తూ ముషారఫ్ రక్తరహిత తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చారు. రెండేళ్ల త‌రువాత పాక్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2001 నుంచి 2008 వ‌ర‌కు పాక్‌ను అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. అభిశంస‌న‌ను త‌ప్పించుకునేందుకు అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ముషారఫ్‌పై దేశద్రోహం అభియోగాలు మోపబడ్డాయి. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు 2019లో మరణశిక్ష విధించబడింది. అతని మరణశిక్షను తరువాత తాత్కాలికంగా నిలిపివేశారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య, రెడ్ మసీదు మతపెద్దల హత్య కేసులో ముషారఫ్‌ను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించారు. 2016 నుంచి ఆయ‌న దుబాయ్‌లోనే ఉంటున్నారు.

Next Story