కమలా హారిస్‌ను ఎదుర్కోడానికి తులసిని రంగంలోకి దింపిన ట్రంప్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చకు సిద్ధమయ్యారు.

By Medi Samrat  Published on  17 Aug 2024 6:47 PM IST
కమలా హారిస్‌ను ఎదుర్కోడానికి తులసిని రంగంలోకి దింపిన ట్రంప్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చకు సిద్ధమయ్యారు. డిబేట్ లో తనకు సహాయపడటానికి మాజీ డెమొక్రాటిక్ కాంగ్రెస్ మహిళ, హిందూ-అమెరికన్ నాయకురాలు తులసీ గబ్బార్డ్‌ను ట్రంప్ తీసుకువచ్చారు. ఏబీసీ న్యూస్ డిబేట్‌లో వేదికపై కమలా హ్యారిస్, ట్రంప్‌తో పాటు తులసి గబ్బర్ కూడా ఉంటారని తెలిపింది.

సెప్టెంబర్ 10న ABC న్యూస్ డిబేట్‌లో ట్రంప్, కమలా హారిస్ తో తలపడబోతున్నారు. అయితే కమలాకు కౌంటర్ వేయడానికి తులసిని రంగంలోకి దింపారు డొనాల్డ్ ట్రంప్. 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత డెమొక్రాటిక్ పార్టీకి రాజీనామా చేశారు తులసి. 2019 డెమొక్రాటిక్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ డిబేట్‌లో హారిస్ ను గబ్బార్డ్ ఓడించిన చరిత్ర ఉండడంతో తన డిబేట్ కోసం ట్రంప్ ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

Next Story