ఆ ఫుట్ బాల్ ఆటగాడి కుటుంబాన్ని దేశం దాటనివ్వకుండా చేశారు

Footballer Ali Daei's family stopped from leaving country. ఇరాన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు అలీ దాయి కుటుంబాన్ని దేశం విడిచి వెళ్లకుండా నిలిపివేశారు.

By M.S.R  Published on  27 Dec 2022 2:45 PM GMT
ఆ ఫుట్ బాల్ ఆటగాడి కుటుంబాన్ని దేశం దాటనివ్వకుండా చేశారు

ఇరాన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు అలీ దాయి కుటుంబాన్ని దేశం విడిచి వెళ్లకుండా నిలిపివేశారు. 53 ఏళ్ల సాకర్ లెజెండ్ తన భార్య, కుమార్తె దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి అంతర్జాతీయ విమానాన్ని దారి మళ్లించారని ఆరోపించారు. పోలీసుల కస్టడీలో 22 ఏళ్ల మహ్సా అమినీ మరణించిన కారణంగా దేశంలో చెలరేగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు అలీ దాయీ బహిరంగంగా తన మద్దతును వినిపించారు. హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనలను అణిచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం పలువురు నటులు, క్రీడాకారులు, పాత్రికేయులు, న్యాయవాదులతో సహా పలు ప్రముఖ వ్యక్తులను అరెస్టు చేసింది.

ఫుట్‌బాల్ క్రీడాకారుడు అలీ దాయి కుటుంబం టెహ్రాన్ నుండి దుబాయ్‌కి వెళ్లడానికి ప్రయత్నించగా.. విమానం దారి మళ్లించి.. తిరిగి ఇరాన్ ద్వీపంలో ల్యాండ్ చేయించారని అలీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత డేయీ భార్య, బిడ్డను విమానం నుంచి కిందకు దించేశారు. వాళ్లు ఎక్కడ ఉన్నారో దీని గురించి ఎవరూ నాకు సమాధానం ఇవ్వలేదని వాపోయారు. కిష్ ద్వీపంలో విమానం దిగిన తర్వాత అలీ భార్య, కుమార్తెను విమానం నుండి దించేశారు.

అలీ దాయి ఇరాన్ కు చెందిన అత్యంత ప్రసిద్ధ క్రీడాకారులలో ఒకరు. జాతీయ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, అతను 1990లలో, 2000 ప్రారంభంలో అంతర్జాతీయ స్థాయిలో తన దేశానికి 109 గోల్‌లు సాధించాడు. అలీ దాయి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు.


Next Story