దివంగత ఫుట్‌బాల్ క్రీడాకారుడు డీగో మారడోనా.. తాను టీనేజ్ వయస్సులో ఉన్న సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడనని క్యూబా దేశానికి చెందిన ఓ మహిళ సంచనల ఆరోపణలు చేసింది. 2020 నవంబర్ 25న డీగో మారడోనా ఓ ఆపరేషన్ అనంతరం మరణించారు. అయితే ఇటీవల ఓ మహిళ అతడికి సంబంధించి విషయాలపై పలు ఆరోపణలు చేసింది. మారడోనా అనుచరులు డ్రగ్స్, భౌతికదాడులు, మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని క్యూబాకు చెందిన 37 ఏళ్ల మహిళ అమెరికా మీడియా ముందు మాట్లాడారు. అయితే ఈ వ్యవహారంపై బాధిత మహిళ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ అర్జెంటీనాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విచారణ చేసింది. ఈ క్రమంలోనే గత వారం ఆ మహిళ కోర్టు విచారణకు హాజరైంది. తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో తెలిపింది.
తాను టీనేజ్‌లో ఉండగా 2001లో మారడోనాను కలిసానని, అప్పుడు ఆయన డ్రగ్స్‌కు సంబంధించిన చికిత్స కోసం క్యూబాకు వచ్చారని తెలిపింది. ఆ టైమ్‌లోనే మారడోనా తనపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత నాలుగేళ్లు సన్నిహితంగా ఉన్నానని తెలిపింది. తనను మారడోనా చిత్రహింసలకు గురిచేశాడని, డ్రగ్స్ తీసుకోవాలని బలవంతం చేశాడని, కొన్ని సార్లు భౌతిక దాడులకు పాల్పడ్డాడని వివరించింది. అప్పటి నుండి అతని దూరంగా ఉంటున్నానని మహిళ తన బాధను పంచుకున్నారు. తాను కోర్టుకు చెప్పాల్సిన విషయాలన్ని చెప్పానని, ఇకపై ఈ విషయాల్లో తాను జోక్యం చేసుకోనన్నారు. ఇన్నేళ్ల తర్వాత జరిగిన ఘటనపై నోరు విప్పడం చాలా సంతోషాన్ని కలిగించిందని మహిళ తెలిపారు. తనలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదని, తనలా బాధపడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యం ముందుకు వచ్చి మౌనం వీడాలన్నారు.