యూకేలో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం.. ధృవీక‌రించిన ప్ర‌ధాని

First Omicron death in uk. బ్రిటన్‌లో తొలి ఓమిక్రాన్‌ మరణం సంభవించింది. ఈ మరణాన్ని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా ధృవీకరించారు.

By అంజి  Published on  13 Dec 2021 1:26 PM GMT
యూకేలో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం.. ధృవీక‌రించిన ప్ర‌ధాని

దక్షిణాఫ్రికా దేశంలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌.. మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలకు పాకుతోంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఓమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. అయితే ఈ వేరియంట్‌ కేసులు నమోదు కావడంతో.. ప్రాణాలు తీయడం కూడా మొదలు పెట్టింది. బ్రిటన్‌లో తొలి ఓమిక్రాన్‌ మరణం సంభవించింది. ఈ మరణాన్ని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా ధృవీకరించారు. పశ్చిమ లండన్‌లోని పడింగ్టన్‌ సమీపంలో ఓ వ్యాక్సినేషన్‌ క్లినిక్‌ను బోరిస్‌ జాన్సన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడారు. ఓమిక్రాన్‌ వల్ల ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. తాజాగా ఓమిక్రాన్‌ వేరియంట్‌ సోకి ఓ వ్యక్తి మరణంచిడం బాధాకరమని అన్నారు.

ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ మ‌ధ్య‌ర‌కం వెర్ష‌న్ అని తాను భావిస్తున్నానని బోరిస్‌ జాన్స్‌ పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్ మ‌రింత వ్యాప్తి చెందకుండా అదుపు చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. ప్రజల్లో ఇది ఎంత వేగంగా వ్యాపిస్తున్నదో గుర్తించాల్సిన అస‌వ‌రం ఉందన్నారు. అదేవిధంగా ఈ వేరియంట్ క‌ట్ట‌డికి అంద‌రికీ బూస్ట‌ర్ డోస్‌లు అందించ‌డ‌మే ఉత్త‌మం అని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడ్డారు. డెల్టా వేరియంట్‌ కంటే ఓమిక్రాన్‌ ఎక్కువ వేగంగా వ్యాపిస్తోంది. డిసెంబర్ 9 నాటికి కనీసం 63 దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ కనుగొనబడింది.

Next Story