ఐదంతస్తుల బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 63 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరంలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని బహుళ అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం 63 మంది మరణించారు
By అంజి Published on 31 Aug 2023 3:30 PM ISTఐదంతస్తుల బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 63 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరంలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని బహుళ అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం 63 మంది మరణించారు, 43 మంది గాయపడ్డారని ఎమర్జెన్సీ సర్వీసెస్ గురువారం తెలిపింది. సిటీ సెంటర్‌లోని ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగడానికి కారణం ఏమిటనేది అస్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. జొహన్నెస్‌బర్గ్ అత్యవసర సేవల ప్రతినిధి రాబర్ట్ ములాడ్జి మాట్లాడుతూ.. తెల్లవారుజామున 1:30 గంటలకు డెల్వర్స్ అండ్ ఆల్బర్ట్స్ వీధుల మూలలో ఉన్న భవనంలో అగ్నిమాపక సిబ్బందికి మంటలు వ్యాపించాయని చెప్పారు.
''ఇది ఐదు అంతస్తుల భవనం, ఈ ఉదయం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మేము వెంటనే అగ్నిమాపక కార్యకలాపాలను నిర్వహించాం. భవనం లోపల ఉన్న వ్యక్తులను మేము అక్కడికి చేరుకున్న వెంటనే ఖాళీ చేయించాం'' అని ములాడ్జీ తెలిపారు. ఆల్బర్ట్ అండ్ డెల్వర్స్ స్ట్రీట్స్ మూలలో ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. "63 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 43 మంది గాయపడ్డారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది" ములాడ్జీ ఎక్స్‌లో పోస్ట్ చేసారు.
ఎక్స్‌లో ములాడ్జీ పోస్ట్ చేసిన వీడియో భవనం వెలుపల అగ్నిమాపక ట్రక్కులు, అంబులెన్స్‌లను కాలిపోయిన కిటికీలతో చూపించింది. మృతుల్లో ఓ పసిపాప కూడా ఉంది. గాయపడిన వారిలో కొందరికి పొగ పీల్చడంతో పాటు మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మంటలు అదుపులోకి వచ్చాయని, "డంపింగ్ డౌన్" అలాగే సిబ్బంది రెస్క్యూ, సెర్చ్ కార్యకలాపాలలో బిజీగా ఉన్నారని ములాడ్జీ చెప్పారు. భవనం లోపల అనధికారిక నివాసం చాలా మంది నివాసం ఉన్నారని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా ప్రజలు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చిక్కుకుపోయి ఉండవచ్చని ఆయన అన్నారు.
"ప్రతి అంతస్తులో ఒక అనధికారిక సెటిల్‌మెంట్ ఉంది. అంతస్తుల మధ్య నిర్మాణాల కారణంగా ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్న వారు చిక్కుకున్నారు" అని న్యూస్24 వెబ్‌సైట్ నివేదించింది. మేము ఫ్లోర్ నుండి ఫ్లోర్‌కు వెళ్తున్నందున మృతుల సంఖ్య 60 కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని అన్నారు. మంటల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. జోహన్నెస్‌బర్గ్ నగర విపత్తు నిర్వహణ అధికారులు బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందించడం ప్రారంభించాయి.