న్యూజిలాండ్ లో ఓ హాస్టల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వెల్లింగ్టన్‌లోని నాలుగు అంతస్తుల హాస్టల్‌లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించినట్లు న్యూజిలాండ్ హెరాల్డ్ నివేదించింది. అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగింది. నాలుగు అంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. 12:30 గంటలకు లోఫర్స్ లాడ్జ్ హాస్టల్ లో అగ్నిప్రమాదం జరిగిందని అత్యవసర సేవలకు సమాచారం అందించారు. భవనంలో స్ప్రింక్లర్లు లేవని అధికారులు ధృవీకరించారు. ఇంకా 20 మంది ఆచూకీ తెలియలేదని న్యూజిలాండ్ హెరాల్డ్ నివేదించింది. వెల్లింగ్‌టన్‌లోని లోఫర్స్ లాడ్జ్ హాస్టల్‌లోని 52 మంది వ్యక్తులు ఉంటున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది ఇతరుల కోసం వెతుకుతున్నారని వెల్లింగ్టన్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ డిస్ట్రిక్ట్ మేనేజర్ నిక్ ప్యాట్ తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. అగ్నిమాపక, అత్యవసర అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. వెల్లింగ్‌టన్ సిటీ కౌన్సిల్ ప్రతినిధి రిచర్డ్ మాక్లీన్ మాట్లాడుతూ, అగ్నిప్రమాదం నుండి తప్పించుకున్న సుమారు 50 మందికి సహాయం చేస్తున్నామని అన్నారు.