ఫుడ్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం

చైనాలోని ఉత్తర నగరం జాంగ్జియాకౌలోని ఫుడ్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Medi Samrat  Published on  4 Jan 2025 4:35 PM IST
ఫుడ్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం

చైనాలోని ఉత్తర నగరం జాంగ్జియాకౌలోని ఫుడ్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్ర‌మాదంలో ఎనిమిది మంది మరణించగా.. 15 మంది గాయపడ్డారు. జాంగ్జియాకౌ నగరంలోని లిగువాంగ్ మార్కెట్‌లో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయని ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

నివేదిక ప్రకారం.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మాంసాన్ని కాల్చడానికి ఉపయోగించే గ్యాస్ బాటిళ్ల నుండి మంటలు సంభవించడం.. తాగి ప‌డేసిన‌ సిగరెట్లు, పాత మౌలిక సదుపాయాలైన భూగర్భ గ్యాస్ లైన్లు మంటలు, పేలుళ్లకు కారణమ‌వ‌చ్చ‌ని అధికారులు అనుమానిస్తున్నారు.

బీజింగ్ సరిహద్దులో ఉన్న హెబీ ప్రావిన్స్‌లో ఉన్న జాంగ్జియాకౌ.. 2022 వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఈవెంట్‌లను నిర్వహించింది. జాంగ్జియాకౌ నగరంలో జరిగిన ఈ ప్రమాదం మార్కెట్‌లో భారీ విధ్వంసం సృష్టించింది. స్థానిక యంత్రాంగం సంఘటనపై దర్యాప్తు చేస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదిలావుంటే.. కొద్దిరోజుల క్రితం చైనాలోని జుహైలో డ్రైవర్ వాహనంతో జనాన్ని గుద్ది బీభ‌త్సం సృష్టించాడు. ఈ ఘోర ప్రమాదంలో 35 మంది మరణించగా.. 43 మందికి పైగా గాయపడ్డారు.

Next Story