పార్టీలో చిందులేసిన ఫిన్లాండ్ ప్ర‌ధాని.. వీడియో వైర‌ల్‌.. డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని వివ‌ర‌ణ‌

Finland PM Party Video Goes Viral.అత్యంత పిన్న వ‌య‌స్కురాలైన ప్ర‌ధానిగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్ ప్ర‌ధాని సనా మారిన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Aug 2022 4:14 AM GMT
పార్టీలో చిందులేసిన ఫిన్లాండ్ ప్ర‌ధాని.. వీడియో వైర‌ల్‌.. డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని వివ‌ర‌ణ‌

అత్యంత పిన్న వ‌య‌స్కురాలైన ప్ర‌ధానిగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్ ప్ర‌ధాని సనా మారిన్ మ‌రోసారి వివాదంలో చిక్కుకుంది. త‌న మిత్ర బృందంతో క‌లిసి పార్టీ చేసుకున్న సంద‌ర్భంలో ఆమె డ్యాన్స్ చేస్తున్న ప‌లు వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ఆ దేశ ప్ర‌తిప‌క్ష‌పార్టీలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుపిస్తున్నాయి. ఆ స‌మ‌యంలో స‌నా మారిన్ డ్ర‌గ్స్ తీసుకుంద‌ని ఆరోపించాయి. వెంట‌నే ఆమెకు డ్ర‌గ్స్ టెస్ట్ నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఓ వీడియోలో ప్ర‌ధాని స‌నా మారిస‌న్ స‌హా ఆరుగురు మ‌హిళ‌లు డ్యాన్స్ చేస్తున్నారు. ఓ పాట‌కు స‌నా మారిన్ నేల‌పై మోకాళ్ల‌పై కూర్చొని డ్యాన్స్ చేస్తున్న‌ట్లు క‌నిపించింది. ఆమె రెచ్చిపోయి డ్యాన్స్ చేయ‌డానికి డ్ర‌గ్స్ తీసుకోవ‌డ‌మే కార‌ణ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి.

ఇక‌.. త‌న‌పై ఆరోప‌ణ‌లు తీవ్ర‌త‌రం అవుతుండ‌డంతో ప్ర‌ధాని స‌నా మారిన్ స్పందించారు. ఆ వీడియోలో ఉంది తానేన‌ని ఒప్పుకుంది. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని చెప్పుకొచ్చింది. ఆ వీడియో లీక్ కావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని తెలిపింది.

"ఓ రోజు సాయంత్రం స్నేహితుల‌తో క‌లిసి పార్టీ చేసుకున్నాము. ఆ రోజు స‌ర‌దాగా డ్యాన్సులు చేయ‌డంతో పాటు పాట‌లు కూడా పాడుకున్నాము. ప్రైవేటుగా చేసుకున్న ఆ పార్టీ వీడియోలు లీక్ కావ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఆ పార్టీలో కేవ‌లం ఆల్క‌హాల్ త‌ప్ప ఇంకా ఏమీ తీసుకోలేదు. చ‌ట్టాల‌ను ఎక్క‌డా అతిక్ర‌మించ‌లేదు. ఏ త‌ప్పు చేయ‌లేదు". అని ప్ర‌ధాని స‌నా మారిన్ వివ‌ర‌ణ ఇచ్చారు.

కాగా.. గ‌తంలో ఓ కరోనా రోగితో సన్నిహితంగా మెలిగిన ప్ర‌ధాని స‌నా ఆ తర్వాత ఓ క్లబ్‌కు వెళ్ల‌డం తీవ్ర దురామాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. అందుకు త‌న‌ను క్ష‌మించాల‌ని కోర‌డంతో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది.

Next Story