హానీ ట్రాప్.. పాక్ కు కీలక సమాచారం

External Affairs Ministry driver arrested for espionage. విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన డ్రైవర్‌ గూఢచర్యానికి పాల్పడడంతో అతడిని అధికారులు అరెస్టు చేశారు.

By M.S.R  Published on  18 Nov 2022 2:30 PM GMT
హానీ ట్రాప్.. పాక్ కు కీలక సమాచారం

విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన డ్రైవర్‌ గూఢచర్యానికి పాల్పడడంతో అతడిని అధికారులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌ మహిళ హనీ ట్రాప్‌లో పడిన అతడు కీలక సమాచారాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లీక్ లకు పాల్పడినందుకు డబ్బులు కూడా పాక్ నుండి పొందాడు. ఈ విషయం తెలియడంతో ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తితో పాకిస్థాన్‌కు చెందిన ఒక మహిళ పూనం శర్మ అలియాస్‌ పూజ పేరుతో పరిచయం పెంచుకుంది. డబ్బులు ఆశపెట్టి ఆ శాఖకు చెందిన కీలక సమాచారం, పత్రాలను ఆ డ్రైవర్‌ నుంచి ఆమె సంపాదించింది. ఈ విషయంపై ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు సమాచారం అందింది. దర్యాప్తులో వివరాలు లీక్ అయ్యాయని గుర్తించారు. పాకిస్థాన్‌ మహిళకు కీలక సమాచారం, పత్రాలు అందజేస్తున్న విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన కారు డ్రైవర్‌ను జవహర్ లాల్ నెహ్రూ భవన్‌ వద్ద శుక్రవారం అరెస్ట్‌ చేశారు.


Next Story