కెన్యా ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా భారత్ లో ప్రాణాలు వదిలారు. ఆయుర్వేద చికిత్స కోసం కేరళకు వచ్చిన ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇటీవలె కేరళకు వచ్చిన రైలా ఒడింగా బుధవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఆయన మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు.
80 ఏళ్ల రైలా ఒడింగాకు ఆయుర్వేద వైద్యం అంటే నమ్మకం. ఆయన కుమార్తె కంటి చూపు సమస్యతో బాధపడగా ఆమెకు కేరళలో ఆయుర్వేద వైద్యం చేయించారు. ఆమెకు ఉన్న దృష్టి సమస్య తీరిపోవడంతో ఆయుర్వేదంపై ఇష్టం పెంచుకున్నారు. కొన్ని రోజుల క్రితమే మళ్లీ ఆయుర్వేద వైద్యం కోసం కేరళకు రాగా ఈ విషాదం చోటు చేసుకుంది.