'చెంప దెబ్బ కాదు.. స‌ర‌దాగా మాట్లాడుకున్నాం'.. అందరూ శాంతించండ‌న్న‌ ఫ్రాన్స్ అధ్యక్షుడు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Medi Samrat
Published on : 27 May 2025 7:01 PM IST

చెంప దెబ్బ కాదు.. స‌ర‌దాగా మాట్లాడుకున్నాం.. అందరూ శాంతించండ‌న్న‌ ఫ్రాన్స్ అధ్యక్షుడు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య‌తో క‌లిసి వియత్నాం పర్యటనకు వెళ్ల‌గా ఆమె కార‌ణంగానే ఈ వీడియో వైర‌ల్ అయిన‌ట్లు తెలుస్తుంది. మాక్రాన్ దంపతులు తమ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి వియత్నాం చేరుకున్నారు. ఈ సమయంలో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్లైట్ దిగే ముందు అతని ముఖంపై చేతితో ఒక్క‌టేసింది. ఇది జ‌రిగిన అనంత‌రం హనోయి విమానాశ్రయానికి చేరుకున్న ప్రతినిధి బృందం వద్ద ఫ్రెంచ్ అధ్యక్షుడు కొంచెం అశాంతి చెందాడు.

ఈ వైరల్ వీడియోపై ఫ్రెంచ్ రాష్ట్రపతి భవన్ ప్రకటన కూడా వచ్చింది. ఇది దంపతుల మధ్య జ‌రిగిన స‌ర‌దా ఘ‌ట‌న అని ఆ ప్రకటన పేర్కొంది. మాక్రాన్ అన్ని పుకార్లను తోసిపుచ్చాడు, "నేను, నా భార్య సరదాగా మాట్లాడుకున్నాము. అందరూ శాంతించాల‌ని పేర్కొన్నాడు.

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అతని భార్య బ్రిగిట్టే మాక్రాన్ ఇలా వార్తల్లోకి రావడం ఇదే మొద‌టిసారి కాదు. ఇంతకు ముందు కూడా వీరిద్దరూ వార్త‌ల్లో నిలిచారు.

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిగిట్టే 1993 సంవత్సరంలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఇమ్మాన్యుయేల్ వయస్సు కేవలం 15 సంవత్సరాలు. బ్రిగిట్టే అతని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు.. అమియన్స్‌లోని కాథలిక్ లైసీ లా ప్రొవిడెన్స్‌లో బోధించేది. బ్రిగిట్టే అప్పుడు బ్యాంకర్ ఆండ్రే లూయిస్ ఆజియర్‌ను వివాహం చేసుకుంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బ్రిగిట్టే-ఆండ్రే పెద్ద కుమార్తె ఇమ్మాన్యుయేల్ క్లాస్‌మేట్.

Next Story