ఎలోన్ మస్క్ ట్విట్టర్ లో మరో మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌పై రాజకీయ ప్రకటనలపై నిషేధాన్ని రెండేళ్ల నుండి కొనసాగిస్తూ ఉండగా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యోచిస్తోంది. Twitter-అనుబంధ ఖాతా అయిన Twitter సేఫ్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. కంపెనీ రాబోయే వారాల్లో రాజకీయ ప్రకటనల అనుమతిని అమలు చేయనుంది.
ట్విట్టర్ 2019లో రాజకీయ ప్రకటనలను నిషేధించింది. ఫేస్‌బుక్ వంటి ఇతర సోషల్ మీడియా కంపెనీలు ఎన్నికల తప్పుడు సమాచారాన్ని దాని సేవల్లో వ్యాప్తి చేయడానికి అనుమతించినందుకు విస్తృతమైన విమర్శలను ఎదుర్కొన్నాయి. ట్విట్టర్ అప్పట్లో రాజకీయ ప్రకటనలను నిషేధించింది. తాజాగా రాజకీయ ప్రకటనలను విస్తరింపజేస్తామని ట్విట్టర్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్‌లో "కాజ్ బేస్డ్ యాడ్స్" కోసం తమ ప్రకటనల విధానాన్ని కూడా సడలించనున్నట్లు ట్విట్టర్ తెలిపింది.