Video : అచ్చం 'ఎలోన్ మస్క్' లాగే ఉన్నాడే.. పాక్ లో ఏమి చేస్తున్నాడో..?

పాకిస్తాన్‌లో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ను పోలిన వ్యక్తికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

By Medi Samrat
Published on : 18 March 2025 5:30 PM IST

Video : అచ్చం ఎలోన్ మస్క్ లాగే ఉన్నాడే.. పాక్ లో ఏమి చేస్తున్నాడో..?

పాకిస్తాన్‌లో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ను పోలిన వ్యక్తికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది. పాకిస్తాన్‌కు చెందిన X యూజర్ గోహర్ జమాన్, ఎలోన్ మస్క్ లాగా కనిపించే వ్యక్తికి సంబంధించిన 18 సెకన్ల క్లిప్‌ను పోస్టు చేశారు."@elonmusk ఈ నకిలీ వ్యక్తిని చూడండి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా లో ఉన్నాడు. ఎలోన్ మస్క్ ఖాన్ యూసఫ్‌జాయ్" అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు.

వీడియోలో ఎలోన్ మస్క్ లాంటి పాకిస్తానీ వ్యక్తి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని స్థానిక తినుబండారంలో తన స్నేహితులతో కలిసి భోజనం ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎలోన్ మస్క్ ఆరు కంపెనీలకు సహ వ్యవస్థాపకుడు, వాటిలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, రాకెట్ తయారీదారు స్పేస్‌ఎక్స్, టన్నెలింగ్ స్టార్టప్ బోరింగ్ కంపెనీ ఉన్నాయని ఫోర్బ్స్ నివేదించింది.


Next Story