ఈవీఎంలు హ్యాక్ అవుతాయ‌న్న సంప‌న్నుడే.. భార‌త్ ఒక్క‌రోజే 64 కోట్ల ఓట్లు లెక్కించిద‌ని అంటున్నాడు..!

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మన దేశంలోని ఎన్నికల వ్యవస్థపై ప్రపంచం ఓ కన్నేసి ఉంచుతుంది.

By Kalasani Durgapraveen  Published on  24 Nov 2024 5:30 AM GMT
ఈవీఎంలు హ్యాక్ అవుతాయ‌న్న సంప‌న్నుడే.. భార‌త్ ఒక్క‌రోజే 64 కోట్ల ఓట్లు లెక్కించిద‌ని అంటున్నాడు..!

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మన దేశంలోని ఎన్నికల వ్యవస్థపై ప్రపంచం ఓ కన్నేసి ఉంచుతుంది. ఈవీఎంల వల్ల మన దేశంలో ఓటింగ్, కౌంటింగ్ జరుగుతున్న వేగం చూసి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇటీవల అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు తెలియడానికి చాలా రోజులు పట్టింది. కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా యజమాని ఎలోన్ మస్క్ భారతదేశ ఎన్నికల ప్రక్రియపై వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను భారత్ లోక్ సభ ఎన్నికలతో పోల్చి చూస్తే.. భారత్ ఒక్కరోజులో 640 మిలియన్లు అంటే 64 కోట్ల ఓట్లను లెక్కించిందని.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని అన్నారు.

అతను సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో.. భారత్‌ ఒక్క రోజులో 640 మిలియన్ల ఓట్లను లెక్కించింది.. కాలిఫోర్నియా ఇంకా ఓట్లను లెక్కిస్తోందని కామెంట్ చేశారు.

నవంబర్ 5-6 తేదీల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. అయితే కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అమెరికాలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరగడం గమనార్హం.

అయితే కొన్ని రోజుల క్రితం ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రద్దు చేయాలని ఆయన అన్నారు. ఈవీఎంలు హ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువని అన్నారు.

Next Story