విషాదం.. ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. 11 మంది చిన్నారుల మృతి

Eleven Babies Die In Senegal Hospital Fire.ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లో విషాదం చోటు చేసుకుంది. టివయూనే న‌గ‌రంలో ఉన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2022 4:08 AM GMT
విషాదం.. ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. 11 మంది చిన్నారుల మృతి

ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లో విషాదం చోటు చేసుకుంది. టివయూనే న‌గ‌రంలో ఉన్న మామ్ అబ్దౌ అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 11 మంది న‌వ‌జాత శిశువులు మ‌ర‌ణించారు. బుధ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది. ఆస్ప‌త్రిలోని పిల్ల‌ల వార్డులో షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లో పెద్ద ఎత్తున వ్యాపించాయి.

అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది చిన్నారుల‌కు కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ముగ్గురిని మాత్ర‌మే ర‌క్షించగ‌లిగారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే రెస్క్యూ బృందాలు అక్క‌డ‌కు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చాయి. అయితే.. అప్ప‌టికే 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ప్రాంతం చిన్నారుల త‌ల్లిదండ్రుల రోద‌న‌ల‌తో నిండిపోయింది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా.. ఈ ప్రమాద ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. చిన్నారుల త‌ల్లులు, కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్ర‌క‌టించారు.

చిన్నారుల మ‌ర‌ణ‌వార్త‌ను విని.. ప్రపంచ ఆరోగ్య సదస్సు కోసం జెనీవా వెళ్లి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అబ్దులాయే డియూఫ్ సర్.. తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశానికి పయనమయ్యారు.

Next Story