విజయ్ మాల్యా కు మరో షాక్..!
ED seizes Vijay Mallya's assets. బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు
By Medi Samrat Published on 5 Dec 2020 2:38 PM ISTబ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) షాక్ ఇచ్చింది. ఫ్రాన్స్‌లో ఉంటున్న అతడి ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. వాటి విలువ 1.6మిలియన్ యూరోలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీలో రూ.14కోట్లుకు పై మాటే. ఈడీ అభ్యర్థన మేరకు ఫ్రెంచ్ అథారిటీ వీటిని స్వాధీనం చేసుకుంది.
విజయ్‌మాల్యాకు బ్రిటన్ సహా పలు దేశాల్లో ఆస్తులున్నాయి. పారిస్‌లో అతడికి ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన ఈడీ.. ఈ మేరకు ఫ్రెంచ్ అధికారులకు లేఖ రాసింది. దీంతో అక్కడి అధికారులు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు 11వేల231కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ ప్రకటించింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న మాల్యాను ఇండియాకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని బ్రిటన్ చట్టాలలోని లొసుగులను వాడుకొని అతడు లండన్ దాటకుండా అక్కడే ఉంటున్నారు. మాల్యా మనదేశంలోని పలు బ్యాంకులకు మొత్తం రూ. 9000 కోట్లు అప్పులు చేసి ఎగ్గొట్టాడు.
మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించడం కోసం యుకెలో పెండింగ్‌లో ఉన్న విచారణపై ఆరు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని నవంబర్ 2 న సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.