నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. ఖాట్మాండ్‌కు తూర్పు ఆగ్నేయ దిశలో 147 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధితుంగ్‌లో భూకంపం సంభవించింది. బీహార్‌లోని సీతామర్హి, ముజఫర్‌పూర్, భాగల్‌పూర్‌లలో కూడా ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. నేపాల్‌లోని ఖాట్మండులో కూడా ఉదయం 7:58 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.
నేపాల్‌లోని ధితుంగ్ భారత్‌లోని ముజఫర్‌పూర్‌కు ఈశాన్యంగా 170 కి.మీల దూరంలో ఉంది. బీహార్‌లో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఇటీవలే 4.7 తీవ్రతతో కూడిన భూకంపం నేపాల్‌లో వచ్చింది. చాలా మంది ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం ఉదయం 6.07 గంటలకు సంభవించింది. భూకంపం ఖాట్మండుకు తూర్పున 100 తూర్పున సింధుపాల్‌చౌక్ జిల్లాలోని హెలంబులో ఉంది.