భారత్ పై ఆంక్షలు విధించడం మొదలుపెట్టిన దేశాలు

Dubai tightens entry for Indians. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో పలు దేశాలు భారత్ కు ప్రయాణాలపై, భారతీయుల ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తూ ఉంది.

By Medi Samrat  Published on  20 April 2021 9:48 AM GMT
Travel restrictions

భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..!‌ కొత్త‌గా 2,59,170 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో‌ 1,54,761 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 1,761 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,80,530కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,31,08,582 మంది కోలుకున్నారు. 20,31,977 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో పలు దేశాలు భారత్ కు ప్రయాణాలపై, భారతీయుల ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తూ ఉంది. భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అమెరికా తన పౌరులకు కీలక సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తి నెమ్మదించే వరకు భారత పర్యటనకు దూరంగా ఉండాలని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి భారత పర్యటనను రద్దు చేసుకోవాలని కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాత్రం ముందస్తుగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కోరింది. హాంకాంగ్‌ భారత విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది.

బ్రిటన్ భారత్ ను రెడ్ లిస్టు లోకి చేర్చింది. భారత్ నుంచి బ్రిటన్‌లోకి ప్రవేశించేందుకు పౌరులకు అనుమతి ఉండదు. ఒకవేళ రెడ్‌ లిస్ట్‌ జాబితాలోని దేశాల్లో ఉన్న బ్రిటీష్‌, ఐరిష్‌ పౌరులు తిరిగి బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటే కచ్చితంగా 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ప్రస్తుతం భారత్‌లో ప్రబలుతున్న కరోనా వేరియంట్‌ అత్యంత ప్రమాదరకమైందని అక్కడి నిపుణులు సూచించడంతో బ్రిటన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌ సహా మొత్తం 40 దేశాలను బ్రిటన్‌ రెడ్‌ లిస్ట్‌లో చేర్చింది. బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.


Next Story