ఆ ఫ్యాన్సీ మొబైల్‌ నంబర్ల‌ను ఎంతకు దక్కించుకున్నారో తెలుసా?

సాధారణంగా ఫ్యాన్సీ మొబైల్ నంబర్లకు ఊహించని ధర పలుకుతూ ఉంటుంది. భారతదేశంలోనే కాదు..

By Medi Samrat  Published on  5 April 2024 2:15 PM GMT
ఆ ఫ్యాన్సీ మొబైల్‌ నంబర్ల‌ను ఎంతకు దక్కించుకున్నారో తెలుసా?

సాధారణంగా ఫ్యాన్సీ మొబైల్ నంబర్లకు ఊహించని ధర పలుకుతూ ఉంటుంది. భారతదేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా ఫ్యాన్సీ నెంబర్లను కొనాలని అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. తాజాగా దుబాయ్ లో ‘058-7777777’ నెంబర్ కు సంబంధించి వేలంపాట వేయగా.. కొన్ని కోట్లకు అమ్ముడుపోయింది.

దుబాయ్‌లో జరిగిన ‘మోస్ట్ నోబుల్ నంబర్స్’ వేలంపాటలో ఒక ప్రత్యేకమైన మొబైల్ నంబర్ ‘058-7777777’ రికార్డు స్థాయిలో 3.2 మిలియన్ల (రూ. 7,26,97,684)కి అమ్ముడుపోయింది. ఈ నంబర్ కోసం వేలంపాట దిర్హామ్ 100,000 (రూ. 22,71,400)తో ప్రారంభమై, సెకన్ల వ్యవధిలోనే దిర్హామ్ 3 మిలియన్లకు చేరుకుంది. మరో ప్రత్యేక సంఖ్య 054-5555555 కోసం బిడ్డర్లు కూడా పోటీ పడ్డారు. రూ. 6,53,02,974 కు కొనుగోలు చేశారు.

మొబైల్ నంబర్ సేల్స్ కు సంబంధించి వచ్చిన డబ్బులు

058-7777777 – దిర్హామ్ 3.2 మిలియన్ (రూ. 7,26,87,892)

054-5555555 – దిర్హామ్ 2.875 మిలియన్ (రూ. 6,53,05,528)

058-7777778 – దిర్హామ్ 305,000 (రూ. 69,28,064)

058-7777770 – దిర్హామ్ 290,000 (రూ. 65,87,340)

056-9111111 – దిర్హామ్ 285,000 (రూ. 64,73,804)

Next Story