అమెరికాలో కాల్పులు.. నలుగురు దుర్మ‌ర‌ణం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం మొదలైంది. చికాగో నగరంలోని రివర్ నార్త్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన డ్రైవ్-బై షూటింగ్‌లో నలుగురు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు

By Medi Samrat
Published on : 3 July 2025 8:30 PM IST

అమెరికాలో కాల్పులు.. నలుగురు దుర్మ‌ర‌ణం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం మొదలైంది. చికాగో నగరంలోని రివర్ నార్త్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన డ్రైవ్-బై షూటింగ్‌లో నలుగురు మరణించగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రివర్ నార్త్ ఏరియాలోని ఒక రెస్టారెంట్ వెలుపల కొందరు గుంపుగా నిలబడి ఉన్నారు. అంతకుముందే ఆ రెస్టారెంట్‌లో ఓ ర్యాపర్ తన ఆల్బమ్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బయట ఉన్న వారి వద్దకు వేగంగా ఓ కారు వచ్చింది. అందులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా గుంపుపై కాల్పులకు తెగబడి, అక్కడి నుంచి పరారయ్యారు.

ఆ కాల్పుల ఘటన తర్వాత పోలీసులు నైట్‌క్లబ్‌ను మూసివేశారు. కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్ కాల్పుల కలకలంతో బాధపడుతూనే ఉంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నుండి అందుబాటులో ఉన్న తాజా గణాంకాలు 2023లో USలో తుపాకీ సంబంధిత గాయాలతో దాదాపు 47,000 మంది మరణించారని చెబుతున్నాయి.

Next Story