మెటా (గతంలో ఫేస్‌బుక్) లో అబార్షన్ అనే పదాన్ని నిషేధించారు. వర్క్‌ప్లేస్ అని పిలువబడే మెటా అంతర్గత మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 'అబార్షన్' అనే పదాన్ని ఉపయోగించడాన్ని నిషేధించింది. ది వెర్జ్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మెటా ఎగ్జిక్యూటివ్ గురువారం ఉద్యోగులతో మాట్లాడుతూ.. కంపెనీ విధానం ప్రకారం కార్యాలయంలో అబార్షన్ గురించి మాట్లాడటం నిషేధించబడింది. అబార్షన్ వంటి విషయాల గురించి ఉద్యోగులు చర్చించకుండా మెటా పైఅధికారులు ఓ సూచన చేశారు.
జానెల్లే గేల్, మెటా HR, VP, ఒక సమావేశంలో ఉద్యోగులతో మాట్లాడుతూ.. అబార్షన్ అనేది వర్క్‌ప్లేస్‌లోని ఉద్యోగుల మధ్య "అత్యంత విభజనతో కూడిన అంశం" అని చెప్పారు. మెటా చర్యను పలువురు ఉద్యోగులు తప్పుబట్టారు. మెటా COO అయిన షెరిల్ శాండ్‌బర్గ్, అబార్షన్‌ను అత్యంత ప్రాథమిక హక్కులలో ఒకటి అని పేర్కొన్నారు. "ప్రతి స్త్రీ, ఆమె ఎక్కడ నివసించినా, ఆమె ఎప్పుడు తల్లి అవుతుందో లేదో ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి. మహిళల ఆరోగ్యం, సమానత్వానికి కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి, "అని ఆమె ఇటీవల తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చారు. అబార్షన్ పై చర్చను నిషేధించే విధానం మెటా ఉద్యోగుల మధ్య విభజనకు కారణమైందని నివేదిక పేర్కొంది.