మరో 8 చైనా యాప్‌లను బ్యాన్ చేసిన అమెరికా.. ఎందుకంటే?
Donald Trump Bans Alipay and Seven Other Chinese Apps. కరోనా మహమ్మారి చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు
By Medi Samrat Published on 8 Jan 2021 2:08 AM GMTకరోనా మహమ్మారి చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపించడంతో అన్ని దేశాలు డ్రాగన్ కంట్రీ పై తీవ్ర విమర్శలు కురిపించాయి. ఈ కరోనా వైరస్ ఏ విధంగా పుట్టుకొచ్చింది సరైన వివరణ తెలపాలంటూ చైనా పై అన్ని దేశాలు ఒత్తిడి తెచ్చాయి. కరోనా వైరస్ గురించి చైనా ప్రభుత్వం ఎలాంటి విషయం చెప్పకపోవడంతో అన్ని దేశాలు చైనాతో ఉన్న సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని భావించాయి. అంతేకాకుండా చైనాలో తయారైన వస్తువులను తమ దేశాలలో వినియోగించకూడదని కొన్ని దేశాలు భావించాయి.
ఈ విధంగా అన్ని దేశాలు చైనాతో ఉన్న సంబంధాలను ఒక్కొక్కటిగా దూరం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చైనా రూపొందించిన టిక్ టాక్, పబ్జి వంటి యాప్ లను భారత దేశంలో ఎంతోమంది ఉపయోగించి వాటిని బానిసై పోయారు.ఆ గేములను ఆడటం కోసం ఏకంగా ప్రాణాలను కోల్పోయిన వారు కూడా ఉన్నారంటే ఏవిధంగా వాటికి బానిస అయ్యారో అర్థం అవుతుంది. ఈ విషయంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం భారత దేశ భద్రత దృష్ట్యా య చైనా యాప్ లను మన దేశంలో నిషేధించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే మరి కొద్ది రోజులలో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్ అమెరికా భద్రతల దృష్ట్యా అమెరికాలో చైనాకి సంబంధించిన వీచాట్ తో సహా మరో 8 యాప్ లను నిషేధం విధిస్తూ మంగళవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.అలీ పే, కామ్‌స్కానర్, క్యూక్యూ వ్యాలెట్, షేర్ ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమ్యాట్, విచాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్‌లపై నిషేధం విధించారు. అమెరికా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన అమలులోకి వచ్చిన ఈ నిషేధం 45 రోజులపాటు కొనసాగుతుందని, అత్యవసర పరిస్థితుల మేరకే అమెరికా ప్రభుత్వం ఈ చైనా యాప్ లను నిషేధించిన ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.