త‌గ్గేదే లే.. 2024 అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నా : ట్రంప్‌

Donald Trump Announces Bid For 2024 US President Election.2024 అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ట్రంప్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2022 10:23 AM IST
త‌గ్గేదే లే.. 2024 అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నా : ట్రంప్‌

ఎవ్వ‌రు ఎమ‌నుకున్నా స‌రే తాను మాత్రం త‌గ్గేదే లే అని అంటున్నాడు అమెరికా వ్యాపార దిగ్గ‌జం, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. 2024 అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. దీంతో 2024లో జ‌ర‌గబోయే అధ్య‌క్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించిన తొలి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. అంతేకాదు.. వైట్ హౌస్ బిడ్ కోసం ప‌త్రాల‌ను ట్రంప్ స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది.

అమెరికాను మ‌ళ్లీ గొప్ప స్థానంలో నిలిపేందుకు, ఈ రాత్రి యునెటైడ్ స్టేట్స్ అధ్య‌క్ష ప‌ద‌వికి నా అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టిస్తున్నా అని టెలివిజ‌న్ స్పీచ్ ద్వారా తెలిపారు. అభిమానుల ముందు ప్ర‌సంగించ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. దేశాన్ని చిధ్రం చేస్తున్న రేడిక‌ల్ లెఫ్ట్ డెమోక్రాట్ల‌ను ఓడిద్దామ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పిలుపునిచ్చారు.

అనంత‌రం త‌న సొంత సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ట్రూత్ సోష‌ల్‌లో ఈ రోజు మ‌న దేశ చ‌రిత్ర‌లో అత్యంత ముఖ్య‌మైన రోజుల్లో ఒక‌టిగా మారుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు పోస్ట్ చేశాడు.

గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ప్ర‌ఖ్యాతిగాంచిన‌ రిప‌బ్లిన్ పార్టీకి చెందిన ట్రంప్ 2016లో అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. అయితే 2020 ఎన్నిక‌ల్లో బైడెన్ చేతిలో ఓడిపోయారు. రిప‌బ్లిక‌న్ పార్టీలో ట్రంప్‌పై వ్య‌తిరేక‌త ఉన్నప్ప‌టికీ 2024లో జ‌రిగే దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న‌ట్లు తెలిపాడు.

Next Story