పాత H1-B వీసా హోల్డర్లకు ఉపశమనం

అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్1-బీ వీసాకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న సంతకం చేశారు.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 21 Sept 2025 9:39 AM IST

Donald Trump, USA administration, old H1B visa holders, internationalnews

పాత H1-B వీసా హోల్డర్లకు ఉపశమనం 

అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్1-బీ వీసాకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న సంతకం చేశారు. ట్రంప్ రాత్రికి రాత్రే H1-B వీసా రుసుమును US $ 1,00,000 (సుమారు రూ. 90 లక్షలు)కి పెంచారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలో ఉంటున్న హెచ్‌1-బీ వీసాదారుల కష్టాలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలపై ట్రంప్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రకారం.. శుక్రవారం ఫీజుల పెంపును ప్రకటిస్తూ ఈ రుసుము వార్షికంగా ఉంటుందని చెప్పారు. కొత్త వీసా, రెన్యూవల్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ రుసుము వర్తిస్తుంది.

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ శనివారం ఈ విషయంపై స్పష్టత ఇస్తూ.. ఈ రుసుము వార్షిక రుసుము కాదని, ఒక్కసారి మాత్రమే ఉంటుందని.. కొత్త దరఖాస్తులపై మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఇప్పటికే H1-B వీసా పొందుతున్న వ్యక్తులకు ఈ రుసుము వర్తించదు.

ఇది వార్షిక రుసుము కాదు. ఇది వన్-టైమ్ ఫీజు అవుతుంది, ఇది H1-B వీసా కోసం కొత్త దరఖాస్తులపై మాత్రమే వర్తిస్తుంది. వీసా పునరుద్ధరణ లేదా H1-B వీసా హోల్డర్లకు ఈ రుసుము వర్తించదు.

హెచ్1-బీ వీసాపై అమెరికా అధ్యక్షుడి కొత్త ఉత్తర్వు ఆదివారం అర్థరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త ఆర్డర్ తర్వాత, ముఖ్యంగా అమెరికన్ టెక్ కంపెనీలలో భయాందోళనలు నెలకొన్నాయి.

అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో ఉద్యోగుల్లో ఎక్కువ మంది హెచ్1-బీ వీసాదారులే. వైట్ హౌస్ ఈ నిర్ణయం తర్వాత, అన్ని పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు 24 గంటల్లో అమెరికాకు తిరిగి రావాలని అభ్యర్థిస్తూ ఇమెయిల్‌లు రాశాయి.

"ప్రస్తుతం US వెలుపల ఉన్న H1-B వీసా హోల్డర్‌లకు $100,000 రుసుము వసూలు చేయబడదు. H1-B వీసా హోల్డర్‌లు US నుండి నిష్క్రమించవచ్చు లేదా ఎప్పుడైనా USలో తిరిగి ప్రవేశించవచ్చు" అని లావిట్ చెప్పారు.

Next Story