హమ్మయ్య.. బయటపడ్డ ట్రంప్

Donald Trump Acquitted By US Senate In Second Impeachment Trial. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా అభిశంసన తీర్మానం నుండి బయటపడ్డారు.

By Medi Samrat
Published on : 14 Feb 2021 1:09 PM IST

Donald Trump Acquitted By US Senate In Second Impeachment Trial

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష చరిత్రలో రెండు సార్లు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న అధ్యక్షుడిగా నిలిచిన సంగతి తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా అభిశంసన తీర్మానం నుండి బయటపడ్డారు. ఐదు రోజుల సుదీర్ఘ చర్చ అనంతరం సెనేట్ ఆయనపై అభిశంసన తీర్మానాన్ని తోసిపుచ్చింది. ట్రంప్ అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరుగగా, బలమైన రిపబ్లికన్లు విజయం సాధించారు. ఈ తీర్మానం 57-43 తేడాతో వీగిపోయింది. అమెరికా కాపిటల్ హౌస్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి తీవ్ర కలకలం రేపగా, జో బైడెన్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన డెమొక్రాట్లు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ప్రతినిధుల సభలో ఆమోదం పొందగా, సెనేట్ లో మాత్రం వీగిపోయింది.

తొలుత రిపబ్లికన్ల నుంచి ట్రంప్ పై వ్యతిరేకత కనిపించినప్పటికీ ట్రంప్ ను అభిశంసిస్తే, తమ పార్టీకి నష్టమేనని భావించడంతో ట్రంప్ కు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. సెనేట్ లో మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తేనే అభిశంసన తీర్మానం ఆమోదం పొంది ఉండేది. ఏడుగురు రిపబ్లికన్లు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ట్రంప్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన బిల్లు ఆమోదం పొందే బలాన్ని డెమొక్రాట్లు పొందలేకపోయారు.సెనేట్ తీర్పును స్వాగతిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అమెరికా చరిత్రను వేధించిన మరో ఘటనకు సంబంధించిన అంశాలను ప్రజలు ఇక మరచి పోవచ్చని ఆయన అన్నారు. అమెరికా రాజకీయ భవిష్యత్తు మరోసారి మారుతుందన్న సంకేతాలు ఈ తీర్పుతో వెలువడ్డాయని ఆయన అన్నారు.


Next Story