ఆ కుక్క నోట్లో ఉన్నది చూసి.. వణికిపోయారు

Dog runs with human head in its mouth in Mexico.కుక్క ఏకంగా మనిషి తలను నోట కరుచుకుని పరిగెత్తడంతో అందరూ షాకయ్యారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2022 4:58 AM GMT
ఆ కుక్క నోట్లో ఉన్నది చూసి.. వణికిపోయారు

అది ఒక భయంకరమైన సంఘటన.. మెక్సికోలోని ఓ పట్టణంలో చోటు చేసుకుంది. వీధికుక్క ఏకంగా మనిషి తలను నోట కరుచుకుని పరిగెత్తడంతో అందరూ షాకయ్యారు. జకాటెకాస్ వీధుల్లో కుక్క తన నోటిలో మనిషి తలను పట్టుకుని పరిగెత్తడాన్ని చూశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్క తన దవడలలో మనిషి మెడను పట్టుకుని వీధిలో తిరుగుతోందని ఫాక్స్ న్యూస్ నివేదించింది.

పోలీసులు చివరికి కుక్క నోటి నుండి తలను తీసుకోగలిగారు. ఈ సంఘటన ఉత్తర రాష్ట్రమైన జకాటెకాస్‌లో చిత్రీకరించబడింది. కుక్క నేరం జరిగిన ప్రదేశం నుండి మనిషి తలను తీసుకుని, దానిని తినడానికి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. పోలీసులు ఘటనాస్థలిని చేరుకునే లోపే కుక్క తలను పట్టుకుని పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మోంటే ఎస్కోబెడో పట్టణంలోని ఏటీఎం బూత్‌లో తల, ఇతర శరీర భాగాలను వదిలివేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుడిని ఇంకా గుర్తించలేదు. నివేదికల ప్రకారం, బాధితుడి లింగం, వయస్సును నిర్ధారించడానికి తలను ఫోరెన్సిక్ బృందానికి పంపారు. గెరెరోలో రెండు ప్రత్యర్థి ముఠాల మధ్య జరిగిన పోరులో మాజీ మేయర్‌తో సహా 18 మంది మరణించిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవలి సంవత్సరాలలో, జకాటెకాస్‌లో హింస పెరిగిపోయిందని.. అధికారులు అదుపు చేయలేకపోతున్నారని పలువురు వాపోతున్నారు.

Next Story